Total Pageviews

Monday, February 20, 2012

కాకాసురుడెవరు ?


కాకాసురుడు ఒక ఇంద్ర కుమారుడు. ఆయన పాపి. సీతారాములు అరణ్యవాసములో ఉన్నప్పుడు, ఈ కాకాసురుడు సీతామ్మవారిని మోహించి ఆ తల్లి స్థనాంతరాన్ని రక్తము చిందగ గాయపరుచును. అది తెలిసిన ఆ రామచంద్రుడు, ఒక దర్భను (గడ్డి పోచను) బ్రహ్మాస్త్రంగా ప్రయోగించును. కాకాసురుడు ముల్లోకాలు తిరిగి ఎల్ల దేవతలనూ శరణు వేడును కాని ఎచ్చటనూ శరణు లభించదు. ఈ లోపు కాకాసురుడు ఒక వింతను గ్రహించును. తాను ఆ రామచంద్రునివైపు ప్రయాణిస్తున్నప్పుడు ఆ బ్రహ్మాస్త్రం దూరముగ ఉండును కాని వేరొక దిక్కున పొయినప్పుడు దాని వేగం ఎక్కువగానుండును. ఇది గమనించిన కాకాసురుడు, ఆ రామచంద్రుని చేరి శరణు వేడును. బ్రహ్మాస్త్రమును ఉపసమ్హరించుట వీలుపడదని కాకాసురుని కుడి కన్ను హరించి వీడును ఆ రామభద్రుడు.   

అంజనీ తనయుడు సీతామ్మవారి జాడ లంకలో కనుగొన్నప్పుడు, ఆ తల్లి తన గుర్తుగా తన చెంగున ఉన్న చూడామణిని ఇచ్చి ఈ కాకాసురుని కథ  హనుమంతునికి వినిపించి శ్రీరామునికి గుర్తుగా వినిపించమని కోరును. 

ఏదైనప్పటికీ, కాకాసురునికి "చావు తప్పి కన్ను లొట్ట పొయింది"

శ్రీ రామ రక్ష !       

అర్ధాలు
కాకః (సంస్కౄతం) = కాకి

అసురుడు = రాక్షసుడు

No comments:

Post a Comment